|
| లోపలి పేజిల్లో... |
|
|
పుదీనాతో మొటిమలు మాయం
డాక్త్టర్ నిరంజన్ కుమార్ | టైమ్స్ అఫ్ ఆంధ్ర
' ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఆకుకూరల్లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇక కరివేపాకు, కొత్తిమీరలను ఆహారంలో తీసుకోవడం ద్వారా కేశాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి పోషకాలను కలిగినదే పుదీనా.
పుదీనాను ఇంతవరకూ మనం ఘుమఘుమలాడే వంటకాల తయారీలో ఉపయోగించాం. అయితే దీనిని సౌందర్య సంరక్షణలోనూ ఉపయోగించవచ్చు. ఈ పుదీనా చుండ్రు, కేశ సంబందిత సమస్యలు, మొటిమలను నివారిస్తుంది. యుక్త వయసులో వచ్చే మొటిమలను తగ్గించడంలో పుదీనా ముఖ్య పాత్ర వహిస్తుంది. జిడ్డు చర్మం కలవారు వేసవిలో అధిక సమస్యలను ఎదుర్కొంటారు. వారు కొన్ని చిట్కాల ద్వారా వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించాలి.
తర్వాత పాలతో శుభ్రంగా కడగాలి. రెండు స్పూన్ల పుదీనా రసంలో స్పూన్ ముల్తాని మట్టి, పావు స్పూన్ కస్తూరి పసుపులను కలిపి ముఖానికి రాసి ఆరాక చన్నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
|
|
|
|
|