|
| లోపలి పేజిల్లో... |
|
|
విజయవాడ నగరపాలక సభలో రభస
విజయవాడ ప్రతినిధి | టైమ్స్ అఫ్ ఆంధ్రా
చిరంజీవికి టెన్షన్ పెంచే అంశాలు చకచకా సాగిపోతున్నయ్. శంకర్ దాదా జిందాబాద్ సినిమా నిర్మాణం తీరుపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి సినిమా విడుదల తరువాత కూడా కలెక్షన్స్ విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్న తెలిసిందే.
అందుకే తదుపరి నటించే చిత్రాన్ని అంచనాలకు తగ్గట్టుగా నిర్మించాలని, ఆ సినిమా కెరీర్ లో 150వ చిత్రం కూడా కానున్నందున ప్రత్యేక శ్రద్ధతో నిర్మించాలనే కృతనిశ్చయంతో చిరు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వాసులు అనుకుంటున్నారు. ఆ చిత్రం చిరంజీవి చిరకాల వాంఛ కూడా అయిన ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి చిత్రమే ఆ 150వ చిత్రం కూడా అని అనుకుంటున్నారు. అందుకే ఆ చిత్రానికి స్వయంగా దర్శకత్వం కూడా వహించాలని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
అయితే స్వయంగా దర్శకత్వం వహించడం కంటే సామాజిక చిత్రాలను అద్భుతంగా డీల్ చేసే వివి వినాయక్ ను దర్శకుడిగా పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన కూడా చిరుకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ను పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
|
|
|
|
|