|
| లోపలి పేజిల్లో... |
|
|
మెదక్: ఐదుగురు ట్రాన్స్ కో సిబ్బంది మృతి
మెదక్ ప్రతినిధి | టైమ్స్ అఫ్ ఆంధ్రా
మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ట్రాన్స్ కో సిబ్బంది మృతి చెందారు. వెల్దుర్తి, తూప్రాన్ మండలాల్లో రాత్రి విజిలెన్స్ కేసులు నమోదు చేసుకుని మారుతీ వ్యానులో హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇమాంపూర్ ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగించి. మారుతీ వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.
|
|
|
|
|