|
| లోపలి పేజిల్లో... |
|
|
సంజయ్‌దత్ బెయిల్ కోసం లాయర్ల సన్నాహాలు
జాతీయ ప్రతినిధి | టైమ్స్ అఫ్ ఆంధ్రా
సంజయ్‌దత్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆయన న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఆమోదించగలదని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు.
ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ గడువును పొడిగించేందుకు సైతం న్యాయమూర్తి తిరస్కరించడంతో తీర్పు వెల్లడైన వెంటనే ఆయనను ఆర్ధర్ రోడ్డు జైలుకు తరలించారు.
మూడేళ్లకు పైగా జైలు శిక్షకు గురయ్యే వారికి బెయిల్ ఇచ్చే అధికారం సంబంధింత విచారణ కోర్టుకు లేకపోవడంతో తాను మరో గత్యంతరం లేక దత్‌ను జైలుకు పంపాల్సివస్తోందని టాడా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కోడా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు ఆయనను ఆర్థర్ రోడ్డు జైలు నుంచి టాడా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను తరలించాలని ఆర్థర్ రోడ్డు జైలు అధికారులు రహస్య నివేదికను సమర్పించినట్టు తెలిసింది
|
|
|
|
|